హైదరాబాద్: అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు. అంబర్ పేట పోలీసులు శంకర్ పై మరోసారి రౌడీషీట్ ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు సమాచారం.
2019లో అంబర్ పేట శంకర్‌పై రౌడీషీట్ ను తొలగించారు. తాజాగా రెండు పిఎస్‌లలో కేసుల నమోదుతో శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు సమాచారం. జూన్ నెలలో గాజులరామారం ప్రాంతంలో బిల్డర్ కు తెలియకుండా ప్లాట్లు అమ్మడంతో శంకర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. గతంలో ఓ న్యూస్ చానల్ నిర్వహకుడు, ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండడంతో శంకర్ పై కేసు నమోదైనట్టు ఆరోపణలు వస్తున్నాయి.

