గత ఏడాది ఆరంభంలో విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించిన 'ఛావా'. విక్కీ కౌశల్ హీరోగా(శంభాజీ) నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడు ఔరంగజేబు పాత్రకు తొలుత నటుడు రణ్‌దీప్ హుడాని అనుకున్నారట.
అయితే ఈ ఆఫర్‌ని తిరస్కరించినని రణ్‌దీప తాజాగా వెల్లడించారు. అపుడున్న పరిస్థితుల దృష్ట్యా నిటించేందుకు అంగీకరించలేదుని తెలిపారు.
''ఛావా' ఛాన్స్ వచ్చినప్పుడు నేను 'స్వతంత్ర్య వీర్ సావర్కర్' సినిమాకి సన్నద్ధమవుతున్నాను. దాని కోసం శరీరాకృతిని మార్చుకున్నా. అందుకే ఔరంగజేబు పాత్రకు నేను సరిపోతాను అని అనిపించలేదు. 'ఛావా' మతపరమైన అంశాల చుట్టు తిరుగుతుందన్న భావన కలిగింది. మరోవైపు.. అప్పుడే 'స్వతంత్ర్య వీర్ సావర్కర్' విషయంలో ఓ కోర్టు కేసు ఎదుర్కొన్న. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా వదులుకున్న'' అని రణ్‌దీప్ చెప్పాడు. అయితే ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించి అందరినీ మెప్పించారు.

