న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి-20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలు అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు.
అయితే ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్య విఫలయ్యాడు. గత ఈ కొన్ని మ్యాచులుగా తుది జట్టులో చోటు కోసం వైభవ్ ఎదరుచూస్తున్న అతడు అవకాశం దొరికే దాన్న సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన శైలికి భిన్నంగా ఓపికగా ఆడుతూ 8 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
అయితే ఈ విషయంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. వైభవ్‌కు అలవాటు లేని స్థానంలో (3వ స్థానం) బ్యాటింగ్‌కి రావడం వల్లే అతడు ఇబ్బంది పడ్డాడని అశ్విన్ పేర్కొన్నాడు. అతడి బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలని మేనేజ్‌మెంట్‌కి అశ్విన్ సూచించాడు. ''వైభవ్ అలవాటు లేని స్థానంలో పంపపడంతో అతడు ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ వేరే ఆప్షన్ లేకపోవడంతో అతడు విఫలమయ్యాడనే చెప్పాలి. నీటి నుంచి బయటపడిన చేపలా అతడి పరిస్థితి మారింది. భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. టైమింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్న వేళ.. అతడికి సీనియర్ అండ ఉండటం చాలా కీలకం. టెన్షన్ లేకుండా.. నిలబడటంపై దృష్టి పెట్టాలని ఆ సమయంలో అతడికి చెప్పాల్సింది. ఆరో ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగడం. అతడికి సరిపడే విషయం కాదు. అభిషేక్, సంజు, వైభవ్ జట్టులో ఉంటే.. సంజు మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు రావాలి. వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడేందుకు జట్టులోకి తెచ్చారని నేను అనుకోను'' అని అశ్విన్ విశ్లేషించాడు.

