Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంగద్‌కు ఆధిక్యం

అంగద్‌కు ఆధిక్యం

నతెలంగాణ/ హైదరాబాద్: వికారాబాద్‌లోని వూటీ గోల్ఫ్ కౌంటీలో తెలంగాణ ఓపెన్ 2026 లో అంగద్ చీమా సత్తా చాటాడు. మూడో రౌండ్ అనంరతం అంగద్ టు-షాట్ ఆధిక్యం కొనసాగించి, 7 -అండర్ 65 షూట్ చేసి తన ఐదో డిపి వరల్డ్ పిజిటిఐ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

ఓవరాల్‌కు అంగద్‌కు ఇది 6వ విజయం. చండీగఢ్‌కు చెందిన 36 ఏళ్ల కుర్రాడు చీమా (70-61-65), బుధవారం కెరీర్-లో 11-అండర్ 61 సాధించాడు. అనంతరం గురువారం జరిగిన పోటీల్లో రెండు షాట్లు మెరుగు పరుచుకొని 20-అండర్ 196కు దూసుకెళ్లాడు. లీడర్ పక్కనే ఆడుతూ, 18-అండర్ 198 స్కోరుతో రెండో స్థానంలో కొనసాగుతూ ఢిల్లీకి చెందిన రషీద్ ఖాన్ (66-67-65) అంగద్ 65తో సమానంగా నిలిచాడు. రషీద్ పార్-ఫోర్ 17వ హోల్‌లో ఒకే ఒక్క బోగీకిగాను ఎనిమిది బర్డీలతో రోజంతా ఒత్తిడిని కొనసాగించాడు. హోరాహోరీ సాగిన ఈ రౌండ్‌లో అంగద్.. పార్-ఫైవ్ 16లో 1 ఈగిల్, 8 బర్డీలు, 3 బోగీలు ఉన్నాయి. రషీద్ పదేపదే అంతరాన్ని తగ్గిస్తుండడముతో, అంగద్ తన ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి సొంత బర్డీలతో ప్రతిభచాటాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu