అరేబియా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అమెరికా నౌకాదళానికి చెందిన MH-60S సీ హాక్ హెలికాప్టర్.. అత్యవసరంగా నీటిపై దిగుతుండగా కులిపోయినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
జూలై 1న తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిందని US నౌకాదళం తెలిపింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉన్నారని, వారిలో ముగ్గురిని గాయాలతో రక్షించామని, ఒకరు గల్లంతయ్యారని నౌకాదళం తెలిపింది.
"ఆ ప్రాంతంలో ఉన్న US నౌకాదళం బృందాలు గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోంది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం 'USS జార్జ్ H W బుష్'(నిమిట్జ్-క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్)కు కేటాయించబడిన ఈ హెలికాప్టర్‌పై ఎటువంటి శత్రు దాడి జరగలేదని అధికారులు తెలిపారు.
కాగా, ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో US నౌకాదళం మోహరింపులో 'USS జార్జ్ H W బుష్' కీలక పాత్ర పోషిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న రెండు US ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లలో ఒకటిగా ఉన్న ఈ హెలికాప్టర్.. ఏప్రిల్ 2026 నుండి మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉంది.

