రాంచీ: అథ్లెటిక్స్‌లో పంజాబ్ స్పింటర్ గురీందర్వీర్ సింగ్ నయా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ కఫ్ ఫైనల్లో గురీందర్వీర్ సింగ్ 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు.
100 మీటర్ల పరుగు విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇంతకుముందు ఒడిశాకు చెందిన అనిమేశ్ కుజుర్ 10.15 సెకన్లలో రేసును పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. తాజాగా గురీందర్వీర్ సింగ్ ఈ రికార్డును బద్దలు కొట్టి భారత ఉత్తమ అథ్లెట్‌గా నిలిచాడు.

