మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. వరుస ఫ్లాప్స్ పడ్డప్పుడు కేవలం హీరోయిన్‌గానే సినిమాలు చేస్తానంటూ భీష్మించుకు కూర్చోలేదు, ఐటమ్ సాంగ్స్ నుంచి మొదలుకుని మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లను సైతం తమన్నా చేయడం వల్లే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. తమన్నా తాజాగా మాట్లాడుతూ "మంచి అవకాశాల కోసం, సరైన అవకాశాల కోసం ఎదురు చూడటం వల్ల విజయం దక్కదు, కొత్త విషయాలను నేర్చుకోలేము. అత్యుత్తమ అవకాశం కోసం ఎదురు చూడటం అనేది పెద్ద అబద్ధం. అలా ఎదురు చూడటం వల్ల సమయం వృథా అవుతుంది తప్ప విజయాలు దక్కవు. జీవితంలో మనం మన పని చేసుకుంటూ వెళ్తున్న సమయంలో తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి, తద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం. అంతేకాకుండా గొప్ప విజయాలు నమోదు అవుతాయి"అని పేర్కొంది.

