హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డివొగా పని చేసిన వంశీ మోహన్.. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాలు కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఆ తర్వాత రియల్టర్‌కు ధారదత్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు ఎసిబి గుర్తించింది. దీంతో వంశీ మోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.

