Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయోధ్య లో రామ జన్మభూమి నిర్మాణం జరగాలనీ శిలాన్యాసం వేసింది రాజీవ్ గాంధీ: పొన్నం

అయోధ్య లో రామ జన్మభూమి నిర్మాణం జరగాలనీ శిలాన్యాసం వేసింది రాజీవ్ గాంధీ: పొన్నం

హైదరాబాద్: అయోధ్య లో రామ జన్మభూమి నిర్మాణం జరగాలనీ శిలాన్యాసం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశ ప్రజలు హిందువుల విశ్వాసం అయోధ్య లో రామ మందిరం కోసం ఎంతో మంది డొనేషన్లు ఇచ్చారని, అయోధ్య రామమందిరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిని అయోధ్య ప్రజలు ముందుగానే గమనించారన్నారు.

సోమవారం ఫేస్ బుక్ ఖాతాలో పొన్నం పొస్టు చేశారు. రాముని పేరు మీద ,అక్షింతలు పేరు మీద ఓట్లు అడుక్కునే వీళ్ళను అయోధ్య లో ఓడగొట్టారని చురకలంటించారు. దీనిపై బిజెపి స్పందించాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, దేవుని పేరు మీద అక్షింతలు పేరుతో రాజకీయానికి వాడుకున్నారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున డబ్బులు దొంగతనం చేసి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

అయోధ్య రాయాలయంపై తెలంగాణ బిజెపి నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అయోధ్య ట్రస్ట్ కు ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ కు సన్నిహితులు ఉన్నారని వారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హుండీ లు కొల్లగొట్టారని, రాముని పేరు మీద దేశ వ్యాప్తంగా వసూలు చేసిన చందాలు ఎత్తుకొని పోయారని ధ్వజమెత్తారు. ఇక్కడ ప్రతి ఊర్లో అక్షింతలు పంచి ఓట్లు అడిగారని, తాము రామునికి వ్యతిరేకం కాదు అని, తాము శ్రీరాముడి కళ్యాణంలో పాల్గొంటామని, ఇల్లంతకుంట రామాలయంలో తాను ఎంపిగా ఉన్నప్పుడు ప్రారంభించిన భోజన కార్యక్రమం ఇప్పటికీ నడుస్తుందని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు.

రామాలయంపై బిజెపి పెద్దలు స్పందించాలని, భక్తి పేరు మీద రాముని పేరు మీద రాజకీయాలు చేసే వారు మాట్లాడాలని, అక్కడ జరిగిన దానిపై పొరపాటు అని దేశ ప్రజలకు క్షమాపణలు అడగాలని డిమాండ్ చేశారు. రామ జన్మభూమి అయోధ్య ఆలయంలో సొమ్ములు దొంగిలించడంపై హిందువులు అందరికీ అవమానంగా ఉందని, దేవుడి పేరు మీద జరిగిన స్కామ్ దేవుడి స్కామ్ కి వాడుకున్న పార్టీ బిజెపి అని ఎద్దేవా చేశారు. మజ్లిస్ పేరు తీయంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బతకరని, కిషన్ రెడ్డి గెలవాలంటే మజ్లిస్ ను తిట్టాలి ఇది వారి రాజకీయమని పొన్నం ప్రభాకర్ చురకలంటించారు.

రాష్ట్రంలో ఓటరు సవరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని, ఓటరు సవరణ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైందని వివరించారు. ప్రతి ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, బిఎల్ఎలు, బిఎల్ఒలతో సమన్వయం చేసుకుంటూ అర్హత కలిగిన ఒక ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని, తాను స్వయంగా ఏడు మండలాలు ప్రత్యక్షంగా తిరిగానని, మా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామని, హైదరాబాద్ , సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సర్ పై ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిందని వివరించారు. ఓటరు సవరణ ప్రక్రియ విజయవంతంగా జరగాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu