మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లాలో మంగళవారం బాంబు దాడికి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, ఆ పిల్లల తల్లి గాయపడింది. మోయిరాంగ్ ట్రోంగ్లావోబి ప్రాంతం లోని ఒక ఇంటిపై అనుమానిత ఉగ్రవాదులు బాంబులు విసరడంతో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల బాలిక మరణించారని సీనియర్ అధికారి తెలిపారు.అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ ఈ దాడి అనాగరిక చర్య అని, దీనికి పాల్పడిన నేరస్థులను గుర్తించి చట్టప్రకారం శిక్షిస్తామని అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ సంఘటనకు స్థానికులు ఉదయం నిరసన చేపట్టి ఆ ప్రాంతం లోని పెట్రోల్ పంప్ సమీపాన గల రెండు ఆయిల్ ట్యాంకర్లకు , ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ ముందు టైర్లను తగులబెట్టి తాత్కాలిక అవుట్ పోస్టును ధ్వంసం చేశారు. ఇంఫాల్ తూర్పు జిల్లా లోని పాంగై, ఖురాయ్‌లో వాహనాలను అడ్డుకున్నారు. లాంగ్తబాల్‌లో నడిరోడ్డుపై టైర్లను తగుల బెట్టారు. పరిస్థితిని అదుపు లోకి తేడానికి భద్రతా దళాలు రంగం లోకి దిగాయి. ఇంఫాల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పిల్లల తల్లిని ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ పరామర్శించారు.

