ముంబై: టీమిండియా ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు టి20, ఐదు వన్డేలతో పాటు మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ ఒకటి వరకు భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది.
సుదీర్ఘ రోజుల పాటు సాగే సిరీస్ షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించింది. మొదట ఐదు టి20 మ్యాచుల్లో భారత్ తలపడుతోంది.
అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే టి20 మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభమవుతోంది. రెండో టి20 24న క్రైస్ట్‌చర్చ్‌లోనే జరుగుతుంది. మిగతా మ్యాచ్‌లకు వెల్లింగ్టన్, ఆక్లాండ్, హామిల్టన్‌లు వేదికగా నిలువనున్నాయి. తొలి వన్డే నవంబర్ 4న ఆక్లాండ్‌లో జరుగనుంది. కాగా మొదటి టెస్టు మ్యాచ్‌కు వెల్లింగ్టన్, రెండో టెస్టుకు క్రైస్ట్‌చర్చ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

