ఢిల్లీ : భారత్ లో టీకాల డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 45కోట్ల మందికి పైగా టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 18-44 వయస్సు వారిలో 15.38కోట్లకుపైగా డోసులు వేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఒకే రోజు 39,42,457 మందికి టీకాలు వేసినట్టు వారు పేర్కొన్నారు. ఇందులో 18-44 ఏళ్లలోపు వారికి 20,54,874 మొదటి, 3,00,099 రెండో డోసు టీకాలు వేసినట్టు వారు చెప్పారు. మూడో విడుత టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి 18-44 వయసు ఉన్నవారు 14,66,22,393 మందికి మొదటి, 71,92,485 మంది రెండో డోసు టీకా వేశామని అధికారులు వెల్లడించారు.

