Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే

భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే

మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్‌లో 'సామజవరగమన' ఫేమ్ హాసిత్ గోలి ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో రాబోతున్న ఈ పక్కా మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రవితేజకు జోడీగా పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఇక రవితేజతో పూజా నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. టాలీవుడ్‌లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పూజా హెగ్డేకు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఒక వైపు కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, మరోవైపు హాసిత్ గోలి మార్క్ కామెడీ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక శ్రీ విష్ణు సరసన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu