Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్య వేధింపులతో జడ్జి ఆత్మహత్య

భార్య వేధింపులతో జడ్జి ఆత్మహత్య

ఢిల్లీ: భార్య వేధింపులు తట్టుకోలేక జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అమన్ కుమార్ శర్మ(30) అనే వ్యక్తి జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నాడు.

అమన్ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య న్యాయాధికారి కావడం గమనార్హం. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. కోడలి సోదరి అయిన ఐఎఎస్ అధికారి జోక్యం చేసుకోవడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య, ఆమె సోదరి వేధింపులు తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని అమన్ తండ్రి తెలిపాడు. భార్య వేధింపులు ఎక్కువగా కావడంతో అమన్ ఆత్మహత్యకు ప్రధాన కారణమని అతడు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu