ఉత్తర ప్రదేశ్ లోని మోదీ నగర్‌కు చెందిన ఆశా తన దివ్యాంగుడైన భర్త సచిన్ కోరికను మన్నించి ఏకంగా 180 కిలోమీటర్లు మోసుకొని కాలినడకన ప్రయాణించడం ఆశ్చర్యం కలిగించింది.
ఆశా, సచిన్‌లకు ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు గాయమైంది. చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. నడవలేని స్థితికి చేరాడు. శివభక్తుడైన సచిన్ హరిద్వార్ లోని శివాలయాన్ని దర్శించాలన్న కోరిక కలగడంతో భార్య ఆశా బాధ్యతగా భావించింది. అతన్ని మోసుకొని 180 కిమీ దూరం కాలినడకన ప్రయాణించింది. గత ఏడాది లోనూ ఆమె హరిద్వార్ లోని కన్వర్ యాత్రకు సచిన్‌ను భుజాన తీసుకెళ్లడం విశేషం. భర్త దివ్యాంగుడు కావడంతో అధైర్య పడకుండా భర్తకు అండగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.

