Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిసి రిజర్వేషన్లపై గొడ్డలి పార్టీ కుట్రలు: లోకేష్

బిసి రిజర్వేషన్లపై గొడ్డలి పార్టీ కుట్రలు: లోకేష్

అమరావతి: బిసి రిజర్వేషన్ల అంశంలో పూర్తి స్పష్టతతో ఉన్నామని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీపరంగా 34శాతంపై స్థానాలు బిసిలకు ఇచ్చి తీరుతామని హామీ లోకేష్ ఇచ్చారు. రిజర్వేషన్లు ఖరారు కాకుండా అభ్యర్థిని ప్రకటించిన ఘనత గొడ్డలి పార్టీకే దక్కిందని, బిసి రిజర్వేషన్లు అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు అందరూ చూస్తున్నారని సూచించారు. ఓటమి భయంతో స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారని లోకేష్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల తర్వాత కాలపరిమితి పూర్తయిన నామినేటెడ్ పదవుల భర్తీపై సమీక్షిస్తామని, పనిచేసిన వారికే నామినేటెడ్ పదవుల రెన్యూవల్ ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu