Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రాండింగ్‌లో 'హ్యూమన్ టచ్'

బ్రాండింగ్‌లో 'హ్యూమన్ టచ్'

మన తెలంగాణ/ బిజినెస్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)తో వ్యాపార ప్రపంచంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ డిజిటల్ యుగంలో వ్యాపార కార్యకలాపాలు, మార్కెటింగ్ సేవలు, కస్టమర్ సంబంధాలు అత్యంత వేగంగా మారుతున్నాయి.

ఆటోమేటిక్ టూల్స్, జనరేటివ్ ఎఐ ఆధారిత కంటెంట్ ద్వారా కంపెనీలు తమ వ్యాపార పరిమాణాన్ని, వేగాన్ని సులభంగా విస్తరిస్తున్నారు. అయితే ఎఐ వాడకం విపరీతంగా పెరిగిన ఈ వాతావరణంలో వినియోగదారులలో నమ్మకం, మానవీయ సంబంధాల (హ్యూమన్ టచ్) పట్ల తీవ్రమైన డిమాండ్ పెరుగుతోందని తాజా మార్కెట్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

హ్యూమనైజ్డ్ బ్రాండింగ్

ప్రస్తుతం వ్యాపార ప్రపంచంలో టెక్నాలజీతో పాటు వినియోగదారులతో సహజమైన అనుబంధాన్ని ఏర్పరుచుకోవడమే ప్రధాన వ్యూ హంగా మారింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో వెలువడిన నివేదికల ప్రకారం, ఈ క్రింది గణాంకాలు నమోదు అయ్యాయి. మార్కెట్ పరిశోధన సంస్థల అంచనా ప్రకారం, బ్రాండింగ్ విభాగంలో ఎఐ మార్కెట్ పరిమాణం 2026 నాటికి 3.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 63% మంది వినియోగదారులు ఎఐ డేటా ప్రైవసీ, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 16% మంది కస్టమర్లు మాత్రమే ఎఐ ద్వారా లభించే వ్యక్తిగత సమాచార భద్రతను బలంగా నమ్ముతున్నారు. మార్కెటింగ్ రంగానికి చెందిన 71% మంది నిపుణులు ఎఐ వల్ల ప్రకటనలు, ప్రచారాలు చాలా వేగంగా డిజైన్ అవుతున్నాయని, ఫలితంగా సగటున వారానికి 12 నుండి 15 గంటల పని సమయం ఆదా అవుతోందని స్పష్టం చేశారు. భారత దేశంలో 78% కంటే ఎక్కువ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎస్‌ఎంబిలు) కంటెంట్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌కై ఎఐని ఉపయోగిస్తున్నాయి.

నిపుణుల స్పందన ఇదే..

కంపెనీల బ్రాండ్ల ప్రతిష్ట కేవలం రోబోటిక్ మెసేజ్‌తోనే నిలబడదని, అక్కడ హ్యూమన్ కనెక్షన్ అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్, కన్సల్టింగ్ రంగాలకు చెందిన సీనియర్ స్ట్రాటజిస్టులు మా ట్లాడుతూ, మార్కెటింగ్‌లో ఎఐ వేగాన్ని, ఉత్పాదకతను అందిస్తుంది, కానీ ఒక బ్రాండ్‌ను కస్టమర్‌కు దగ్గర చేసేది అందులోని హ్యూమన్ టచ్ అని అంటున్నారు. పూర్తిగా ఎఐపై ఆధారపడి రూపొందించిన ప్రకటనలకు స్పందించే వారి సంఖ్య తగ్గుతోంది. కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి వ్యాపారాలు పారదర్శకతను, నిజాయితీని ప్రదర్శించడమే ఏకైక మార్గం అని పేర్కొన్నారు.

అలాగే, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (సిఎక్స్) విశ్లేషకులు అభిప్రాయపడుతూ, ఎఐ టూల్స్‌ను ఉపయోగించి వ్యాపార వ్యయాలను తగ్గించుకోవడం మంచిదే. కానీ, వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు లేదా ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకున్నప్పుడు వారితో నే రుగా సంభాషించే మానవ వనరులు (హ్యూమన్ ఏజెంట్స్) అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని అంటున్నా రు. వ్యాపారాలు రాబోయే రోజుల్లో విజ యం సాధించాలంటే ఎఐ వేగాన్ని, మాన వ సృజనాత్మకతతో మేళవించి ఆథెంటిక్ బ్రాండింగ్ రూపొందించుకోవాలి. సమాచారాన్ని విశ్లేషించడానికి ఎఐను ఉపయోగిస్తూనే, కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అయ్యే కథనాలు, కమ్యూనిటీ బిల్డింగ్, పారదర్శక సేవలను అందించే బ్రాండ్లే రాబోయే రోజుల్లో మార్కెట్‌లో ముందుంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu