చెన్నై: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. చదువు పూర్తైన తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చివరలో యువతి పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమెను యువకుడు బండరాయితో కొట్టి చంపిన సంఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా ఖాజామలైలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమల అనే యువతి ఎంబిఎ చదువుతోంది. నవీన్ అనే యువకుడు, అమల గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు చదువులు పూర్తి చేసిన తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పలుమార్లు పెళ్లి చేసుకుందామని యువతిని అడిగినా కూడా అతడు ఒప్పుకోలేదు. మన పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని బ్రేకప్ చెప్పుదామని యువకుడితో యువతి అనడంతో ఒక్కసారిగా నవీన్ సహనం కోల్పోయాడు. విచక్షణారహితంగా యువతిపై దాడి చేసి రాయితో బాదడంతో ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు నవీన్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువతి చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు.

