న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రపంచ నేతలు, ప్రతినిధుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారంనాడు ఏర్పాటు చేసిన విందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కాలేదు.
ఈ డిన్నర్ కార్యక్రమంతో సన్నిహతంగా ఉన్నవారు ఈ విషయం వెల్లడించారు. దీంతో జిన్‌పింగ్ విందుకు గైర్హాజర్‌పై ఊహాగానాలు చెలరేగాయి. అయితే జిన్‌పింగ్ తరఫున ఆదేశ విదేశాంగ మంత్రి వాంగ్ యూ హాజరైనట్టు దౌత్య వర్గాల సమాచారం.
వ్యక్తిగత షెడ్యూల్ ప్రాధాన్యతల దృష్ట్యా జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లిపోయారని, దౌత్య ప్రోటోకాల్ ప్రకారం ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యూ హాజరయ్యారని ఎంఈఏ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ సదస్సులో దేశాధినేతల షెడ్యూల్ ఆధారంగా విదేశాంగ మంత్రులు విందుల్లో పాల్గొనడం సాధారణమేనని ఆ వర్గాలు వెల్లడించాయి. మోదీ-జిన్‌పింగ్ మధ్య చర్చలు ఎంతో సానుకూలంగా జరిగాయని, సదస్సు ముగింపు అనంతరం జిన్‌పింగ్ స్వదేశానికి బయలుదేరి వెళ్లినట్టు అధికారులు తెలిపారు.

