Dailyhunt
బూత్ స్థాయి బలోపేతమే లక్ష్యం

బూత్ స్థాయి బలోపేతమే లక్ష్యం

న తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ పట్టణ, మోత్కూర్ రూరల్, అడ్డగూడూర్ మండలాల బిజెపి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీలత రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కార్యాచరణపై స్పష్టమైన అవగాహన పొందాలని తెలిపారు. ఆ అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు.

బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత ముఖ్యమని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే పార్టీ మరింత విస్తరిస్తుందని తెలిపారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలకు సిద్ధాంతపరమైన, సంస్థాగత పరమైన అవగాహన పెంపొందించబడుతుందని తెలియజేశారు. మోత్కూర్ పట్టణ అధ్యక్షులు చాడా మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మోత్కూర్ రూరల్ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, అడ్డగూడూర్ మండల అధ్యక్షులు ననుబోతు సైదులు, బిజెపి సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, బందారపులింగస్వామి, కొనతం నాగార్జున రెడ్డి జిల్లా కోశాధికారి గుజ్జ సోమ నరసయ్య జిల్లా నాయకుల బయ్యని చంద్రశేఖర్, శిక్షణ తరగతుల ప్రబారి గౌరు శ్రీనివాస్ ఏనుగు జితేందర్ రెడ్డి సోమిరెడ్డి నర్సిరెడ్డి జిల్లా నాయకులు కూరాకుల వెంకన్న పోచం సోమయ్య తిరుమల్ రెడ్డి సజ్జన మనోహర్ ఎడ్ల రాము జిలకర దశరథ మల్లేశం సత్యనారాయణ చంద్రమౌళి విజయలక్ష్మి, రమణ,రేణుక రమాదేవి, తదితరులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu