అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వాటర్ మెన్ కాదని, క్వాటర్ మెన్ వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా విశాఖ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 3 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని, వేలాది బోర్లు ఎండిపోతున్నాయని గుడివాడ విమర్శించారు. మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత..పోతే ఎంత.. అని, తాగునీటి సమస్య పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.

