భువనేశ్వర్: చేతబడి చేస్తున్నారనే అనుమానంతో దంపతులను దారుణంగా హత్య చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం కేంఝర్ జిల్లా దైతారి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
బలిబర్బత్ గ్రామ పంచాయతీ పరిధిలోని హుల్లాబిహాలి గ్రామంలో ఖగేశ్వర్ సోరెన్(42), టుని సోరేన్(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు జూన్ 25 నుంచి కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక దైతారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామానికి చెందిన అనూప్ ముర్ము, శిబోముండా, గంసాహన్సదా, రంగబంద్రా, అంతుశ్ కుమార్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దంపతులు కుమారులు బంధువుల ఇంట్లో వేడుకలు ఉండడంతో వేరే గ్రామానికి వెళ్లారు. ఖగేశ్వర్, టునిలు దంపతులు ఇంటి ముందు వరండాలో కూ. దంపతుల మెడకు తువ్వాళ్లు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాలను గ్రామ శివారులోని బావిలో పడేశారు. నిందితులు నిజాలు ఒప్పుకోవడంతో మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

