ముల్లాన్‌పూర్: టి20 ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ సాధించడమే లక్షంగా పెట్టుకున్నట్టు భారత యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపిఎల్‌లో ఏదో ఒక రోజు ఈ ఫీట్‌ను సాధిస్తాననే నమ్మకం ఉందన్నాడు. తనదైన శైలీలో చెలరేగితే డబుల్ సెంచరీ సాధించడం తనకు అసాధ్యమేమీ కాదని పేర్కొన్నాడు.
ఇక రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరుకోవడం గర్వంగా ఉందన్నాడు. జట్టు విజయాల్లో తన పాత్ర కూడా ఉండడం ఆనందం కలిగిస్తుందన్నాడు. రానున్న మ్యాచుల్లో మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తానని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.

