చెన్నై: తమలోకి దేవుడు వచ్చాడని ఓ దంపతులు నడిబజారులో నగ్నంగా తిరిగిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
కరంబూస్కి గ్రామంలో పళని(56), దీప(48) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు గత కొన్ని రోజుల నుంచి మంత్రాలు, జపాలు చేస్తున్నారు. తమ దేహంలోకి కరుప్పసామి వచ్చాడని, గ్రామంలో నగ్నంగా తిరుగుతూ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రామస్థులు ప్రశ్నించడంతో తమని అడ్డుకుంటే శపిస్తామని, వారు సర్వనాశనం అవుతారని బెదిరించారు. తమను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని కోరారు. ప్రజలు వారిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

