దేశ భక్తి, పౌరుల బాధ్యత, విలువల గురించి కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించిన "ధురంధర్-2" సినిమాను దేశంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.
రాంచందర్ రావు తెలిపారు. ధురంధర్- సినిమాను మంగళవారం రాంచందర్ రావు తన పార్టీ కార్యవర్గంతో పాటు ముఖ్య నాయకులు, మీడియా ప్రతినిధులతో కలిసి చూశా రు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ సౌజన్యంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ మల్టీప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనకు పార్టీ నాయకు లు గౌతం రావు, చంద్రశేఖర్, ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, మాజీ మేయర్ కార్తీక రెడ్డి, మీడియా సె ల్ డాక్టర్ స్వాతి తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శ న అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడు తూ మన దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో పోరాడే సై నికులే కాకుండా,
గూఢచారులు కూడా ఎంతటి త్యాగా లు చేస్తారో ఈ సినిమాలోని అనేక సన్నివేశాలు స్పష్టంగా ప్రతిబింబించించాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో భారత గూఢచారులు దేశ సమగ్రత, భద్రత కోసం పనిచేస్తూ, శతృ దేశాల కుట్రలను వెలికి తీసే విధంగా సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దేశభక్తి మాత్రమే కాదు, దేశ రక్షణపై బాధ్యతను కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రత్యేకంగా, ఈ చిత్రంలో డీ-మానిటైజేషన్ (నోట్ల రద్దు) వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అ ప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందని ఆ యన చెప్పారు. పాకిస్తాన్ నుంచి భారీ స్థాయిలో నకిలీ నో ట్లను పంపించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలనే కుట్రలను, అలాగే చిన్న పిల్లలను దుర్వినియోగం చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించాలనే ప్రయత్నాలను ఈ సిని మా బలంగా ప్రతిబింబించిందని ఆయన తెలిపారు.

