న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్ షాజాద్ భట్టి, అతని సహచరుల ఆదేశాల మేరకు ఢిల్లీ నగరంలో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళిక రచిస్తున్న ఐఎస్ఐ ప్రాయోజిత అంతర్రాష్ట్ర ఉగ్రవాద, ఆయుధాల నెట్‌వర్క్‌ను గురువారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించి, నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిందితుల నుంచి ఒక జిగానా పిస్టల్, ఒక .30 బోర్ పిస్టల్‌తో సహా రెండు విదేశీ పిస్టళ్లు, తొమ్మిది బుల్లెట్లు, ఐదు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ పోలీసులు వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన ఆపరేటివ్‌లతో సంబంధాలున్న నిందితులు, పట్టుబడకుండా ఉండేందుకు తమ హ్యాండ్లర్లు ఏర్పాటు చేసిన విదేశీ ఫోన్ నంబర్లను ఉపయోగిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఆయుధాల చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు.

