Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిఎస్సిలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి: జగన్

డిఎస్సిలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి: జగన్

మరావతి: 2025 మెగా డిఎస్సి కాదు.. దగా డిఎస్సి అని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా ఆధారాలు చూపిస్తే..కేసులు పెడుతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్సిపై ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించామని తెలియజేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని, మెగా డిఎస్సిలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పరు..బుల్డోజర్ చేస్తారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు? అని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. డిఎస్సి పేపర్ల తయారీ, పర్యవేక్షణను ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? అని నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అని జగన్ ప్రశ్నించారు.

ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అని ఫస్ట్ లిస్ట్ లో ఉన్న నవీన్ పేరును సెకండ్ లిస్ట్ లో ఉన్న నవీన్ పేరును సెకెండ్ లిస్ట్ నుంచి ఎందుకు తొలగించారు? అని స్కామ్ ను దాచిపెట్టేందుకు ప్రయత్నం కాదా? అని జగన్ నిలదీశారు. రిక్ర్యూట్ మెంట్ పూర్తయ్యాక జివోలను ఎందుకు మార్చారు? అని నవీన్ లాగిన్ ఐడిని ఎందుకు బ్లాక్ చేశారు? అని నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, బాబు స్కామ్ ల హిస్టరీలో డిఎస్సి ఒక ఆణిముత్యం అని ఎద్దేవా చేశారు. పరీక్షే లేకుండా 372 స్పోర్ట్ప్ కోటా పోస్టులు ఎలా ఇచ్చారు? అని నిలదీశారు. జివో నెంబర్ 4,47తో గేట్లు తెరిచారని పని అయ్యాక జివో నెంబర్ 23,25,56తో గేట్లు మూశారని, డిఎస్సి స్కామ్ ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారని, వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని, ఇలాంటి స్కామ్ ల వల్లే కాక్రోచ్ లు పుట్టుకొస్తున్నాయని ధ్వజమెత్తారు. కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారని జగన్ దుయ్యబట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu