Dailyhunt
దూకుడుగా ఆడుతున్న లక్నో.. విజయానికి చేరువలో..

దూకుడుగా ఆడుతున్న లక్నో.. విజయానికి చేరువలో..

Aiden Markram

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి చేరువ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. పవర్‌ప్లేలో 53 పరుగులు రాబట్టింది. ఓపెనర్‌గా దిగిన మార్క్‌రమ్ 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లక్నో విజయానికి ఇంకా 42 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్‌లో పంత్(31), పూరన్ (1) ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu