Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దులీప్ ట్రోఫీ.. 57 ఏళ్ల రికార్డును తిరగరాసిన వైభవ్

దులీప్ ట్రోఫీ.. 57 ఏళ్ల రికార్డును తిరగరాసిన వైభవ్

Vaibhav Suryavanshi

భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్ 57 ఏళ్ల రికార్డును తిరగరాశాడు.

సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్థ శతకం సాధించిన అతడు.. దులీప్ ట్రోఫీలో అతి చిన్న వయస్సులోనే (15 ఏళ్ల 157 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) పేరిట ఉండేది. 1969లో ఆయన దులీప్ ట్రోఫీలో ఈ ఘనత సాధించాడు. 2005లో పీయూష్ చావ్లా (16 ఏళ్ల 307 రోజులు) కూడా ఈ జాబితాలో ఉన్నాడు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో 81 బంతులు ఎదురుకున్న వైభవ్ 92 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈస్ట్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. ఈస్ట్ జోన్ బ్యాటింగ్‌లో వైభవ్ 92 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (69) రాణించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (16) నిరాశపరిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu