మంచిర్యాల: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక బాలిక, ఇద్దరు మహిళలు ఉన్నారు.
మృతి చెందిన వారు సంచార జాతులకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదవశాత్తు బాలిక చెరువులో పడడంతో ఆమెను కాపాడబోయి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

