Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ

ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ

శ్చిమ బెంగాల్‌లో కమలం వికసించిందని.. బంగాల్‌లోని ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించిన నేపథ్యంలో మోడీ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో బిజెపి బలమైన ఎన్నికల ప్రదర్శన కనబరిచినందని.. ఆ రాష్ట్రాల ప్రజలకు తాను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు. "లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి బీజేపీ కార్యకర్త మరోసారి అద్భుతాలు సృష్టించారని.. వారు కమలాన్ని వికసింపజేశారని అన్నారు.

బిజెపికి బెంగాల్‌ ప్రజలు మద్దతుగా నిలిచారని.. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. బెంగాల్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. కాగా, బెంగాల్ లో మొత్తం 294 స్థానాల్లో బిజెపి 206 స్థానాల్లో ముందంజలో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu