Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈనెల 28న కరువు పరిస్థితులపై భట్టి అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

ఈనెల 28న కరువు పరిస్థితులపై భట్టి అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ముప్పు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ముఖ్యంగా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి అవసరాలకు విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, కరువు నివారణ చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొనే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కరువు ప్రభావాన్ని తగ్గించడంతోపాటు రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం కోరనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu