Dailyhunt
ఎంఐకి ఊహించని షాక్.. ఇక కోలుకోవడం కష్టమే..?

ఎంఐకి ఊహించని షాక్.. ఇక కోలుకోవడం కష్టమే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు చెత్త ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకూ 10 మ్యాచులు ఆడి కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది.

అయితే ముంబై ఇండియన్స్ పరాజయానికి హార్థిక్ పాండ్యా కెప్టెన్సీనే ఒక కారణం అంటూ విమర్శలు వచ్చాయి. దీంతో హార్థిక్‌ని తప్పంచి గత మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

మరి కెప్టెన్ మారడమో.. లేక మరేదైనా కారణమో కానీ.. లక్నోతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్‌ని సైతం ఛేదించి ముంబై ఘన విజయం సాధించింది. దీంతో హార్థిక్ మాకు కెప్టెన్‌గా వద్దు అని ఎంఐ ఫ్యాన్స్‌ అంటున్నారు. అనుకున్నట్లుగానే ముంబైకి హార్థిక్ పాండ్యా షాక్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం రాయ్‌పూర్‌కు జట్టుతో కలిసి హార్థిక్ వెళ్లలేదు. దీంతో హార్థిక్ ఈ మ్యాచ్‌కి కూడా దూరమవుతాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హార్థిక్ లేకపోవడం జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తుందని కొందరు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu