Dailyhunt
ఎండల నుంచి రిలీఫ్.. రానున్న మూడు రోజులు వర్షాలు

ఎండల నుంచి రిలీఫ్.. రానున్న మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్: మండిపోతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని.. రేపు (శనివారం) ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu