అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు సంబంధించిన ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. సోషల్ మీడియాలో హోంశాఖ మంత్రి ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురివకావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
అనిత అకౌంట్ నుంచి వస్తున్న పోస్టులను నమ్మోద్దని అధికారులు తెలిపారు. అకౌంట్ హ్యాక్ కావడంతో ఇప్పటికే ఆమె ఫిర్యాదు చేశారని అధికారులు వెల్లడించారు. అకౌంట్‌ను రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.

