టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే.
'అర్జున్ రెడ్డి' సినిమా నుంచి వీరిద్దరి మధ్య బాండిగ్ మరింత పెరిగిపోయింది. ఆ సినిమా సూపర్‌హిట్ అయిన తర్వాత ఇద్దరు తమ కెరీర్‌లలో బిజీ అయిపోయారు. ఇటు విజయ్ విభిన్నమైన సినిమాలు చేస్తుండగా.. సందీప్ యానిమల్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇటీవల సందీప్ నిర్మించిన 'రోమాంచకం' చిత్రానికి విజయ్ అండగా నిలిచాడు. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఇక తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన 'ఎపిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా సందీప్ వచ్చాడు. ఇదే ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విజయ్ వచ్చాడు.
ఇలా విజయ్, సందీప్ మరోసారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారు. అనంతరం విజయ్, సందీప్‌కి ఓ ఖరీదైన వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ వాచ్‌ని వెంటనే సందీప్ తన చేతికి పెట్టుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

