అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సద్గురు మలయాళ స్వామి ఆరాధనోత్సవాల వేళ ఆశ్రమంలో అవినీతి ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున పరంపర స్వామీజీలు, దాతలు, భక్తులు ఆశ్రమానికి చేరుకొని ధర్నాకు దిగారు.
ఆశ్రమంలోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్రమం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

