Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్‌బిఐ ఉద్యోగుల సమ్మె.. 5 రోజులు బ్యాంకుల మూసివేత

ఎస్‌బిఐ ఉద్యోగుల సమ్మె.. 5 రోజులు బ్యాంకుల మూసివేత

Problems for customers with SBI server down

దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉద్యోగుల సమ్మె కారణంగా సేవలకు అంతరాయం కలగనుంది. వారాంతపు సెలవులు, ఉద్యోగుల సమ్మె, బక్రీద్ పండుగ కారణంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు మూసివేసే అవకాశం ఉంది.

ఈ నెల 23 నాలుగో శనివారం, మే 24 ఆదివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. 16 డిమాండ్ల సాధనకై ఆల్ ఇండియా ఎస్‌బిఐ స్టాఫ్ ఫెడరేషన్ (ఎఐఎస్‌బిఐఎస్‌ఎఫ్) ఈ నెల 25, 26 తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

దీనివల్ల క్యాష్ కౌంటర్లు, చెక్ క్లియరింగ్ వంటి సేవలు నిలిచిపోతాయి. ఆ తర్వాత బక్రీద్ పండుగ సందర్భంగా ఆర్‌బిఐ సెలవు ప్రకటించింది. దీంతో మే 27న హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో, మే 28న ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో సెలవు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌లో మే 27, 28 రెండు రోజులూ బ్యాంకులు మూసివుంటాయి. అయితే ఈ కాలంలో ఎస్‌బిఐ డిజిటల్ సేవలు పనిచేస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu