PV Sindhu
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పివి సింధుకు నిరాశ ఎదురైంది. టైటిల్ పోరులో ప్రపంచ నెం.1 ఆన్ సె యంగ్ (కొరియా) చేతిలో సింధు ఓటమిపాలైంది.
తొలి గేమ్‌ను 21-16 తేడాతో సింధు కైవసం చేసుకోగా.. తర్వాతి గేమ్‌ను ఆన్ సె యంగ్ 21-11తో దక్కించుకుంది. దీంతో మూడో గేమ్ ఉత్కంఠగా మారింది. అందుకు తగ్గట్టే ఆట హోరాహోరీగా సాగినప్పటికీ.. చివరికి 21-12 తేడాతో ఆన్ సె యంగ్ గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆన్ సె యంగ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ దక్కించుకోవడం వరుసగా ఇది మూడోసారి. మరోవైపు, ఇప్పటిదాకా వీరిద్దరూ 11 సార్లు పోటీ పడగా.. అన్ని సార్లు సింధు ఓడిపోవడం గమనార్హం.

