Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫుట్‌బాల్ దిగ్గజం పాలో రోసి మృతి

ఫుట్‌బాల్ దిగ్గజం పాలో రోసి మృతి

మిలన్: ఇటలీ ఫుట్‌బాల్ దిగ్గజం పాలో రోసి (64) మృతి చెందాడు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న రోసి మృతి చెందడంతో ఇటలీ శోక సంద్రంలో ముగిని పోయింది. రోసి మరణించిన విషయాన్ని అతని భార్య ఫెడెరికా కాపెల్లేటి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఇటీవలే అర్జెంటీనా సాకర్ దిగ్గజం డీగో మారడోనా గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదం మరవక ముందే మరో దిగ్గజ ఆటగాడు కన్నూమూశాడు. 1982లో జరిగిన ప్రపంచకప్‌లో ఇటలీకి ట్రోఫీ సాధించి పెట్టిన ఘనత రోసికే దక్కుతోంది. ఆ ప్రపంచకప్‌లో రోసిఆరు గోల్స్‌తో అదరగొట్టాడు. అంతేగాక టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బూట్‌ను సొంతం చేఉకున్నాడు.

ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలువడంతో అతని పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. రోసి మృతిపై పలువురు క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని మృతి ప్రపంచ ఫుట్‌బాల్‌కు తీరని లోటని మెస్సి, రోనాల్డో, జడానే తదితరులు పేర్కొన్నారు.

Italian football legend Paolo Rossi dies

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu