పనాజి: గోవా నుంచి ఢిల్లీకి మంగళవారం ఉదయం 229 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఇండిగో విమానం గాల్లో ఉన్న సమయంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.
ఉదయం 9.16 గంటలకు ఎయిరిండియా విమానం గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరింది.
టేకాఫ్ అయిన 30 నిమిషాల తరువాత రెండు ఇంజిన్లలో ఒక దాంట్లో సమస్య తలెత్తడంతో పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో గోవా ఎయిర్‌పోర్టులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి నార్త్ గోవాలో మోపా లోని విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చారు.

