నేపాల్ ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో అ దేశానికి చెందిన వారితో పాటు 30 దేశాల నుంచి వచ్చిన పర్వతారోహకులు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వచ్చిన పర్యాటకులు ఉన్నారు.
నేపాల్ జాతీయ అత్యవసర కేంద్రం వివరాల ప్రకారం గల్లంతైన వారిలో 113 మంది నేపాలీ పర్యాటకులు, సైన్యం-, పోలీసుల విభాగాలకు చెందిన 85 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ కౌంటీలో ముగ్గురు మరణించగా, 558 మంది గల్లంతైనట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులు ఉన్నట్లు చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ పేర్కొంది.
మరోవైపు నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతయిన వారిలో అమెరికాకు చెందిన 65 మంది, మలేషియా(51), ఉక్రెయిన్(53), ఆస్ట్రేలియా (35), బ్రిటన్(33), కెనడా(25) మంది ఉన్నారు. దక్షిణ కొరియా, సింగపూర్, జర్మనీ, రష్యా, లాత్వియా, న్యూజిలాండ్, జపాన్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్, ఇటలీ, కజకిస్తాన్, పోర్చుగల్, ఐర్లాఒడ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, హంగేరీ, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్, బల్గేరియా, స్విట్జరాండ్ తదితర దేశాల పర్యాటకులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది.

