Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గణాంకాలతో మోడీ గారడీ చేస్తున్నారు: జైరాం రమేశ్

గణాంకాలతో మోడీ గారడీ చేస్తున్నారు: జైరాం రమేశ్

Jai ram ramesh comments on GDP

Jai ram ramesh comments on GDP

హైదరాబాద్: దేశంలో పెట్టుబడులు, వినియోగం తగ్గుతుంటే జిడిపి ఎలా పెరిగిందని రాజ్యసభ ఎంపి జైరాం రమేశ్ మండిపడ్డారు.

భారత దేశ జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని పిఎం మోడీ చెప్పడంతో జైరాం రమేశ్ చురకలంటించారు. గణాంకాలతో మోడీ గారడీ చేస్తున్నాడని మండిపడ్డారు. త్రైమాసిక జిడిపి గణంకాలు దేశంలోని పరిసస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయన్నారు. హైహోల్టేజ్ ధరల భారాన్ని సామాన్యులపై రుద్దుతుందని దుయ్యబట్టారు.

ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలకు దూరం అవుతున్నారన్నారు. 1000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెరిగిందని, ఇంటి నిర్మాణానికి ఉపయోగించి ప్రతి వస్తువు ధరలు డబుల్ అయ్యాయని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని జైరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను దాచి ప్రచారార్భాటం చేస్తున్నారని మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu