హైదరాబాద్: గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు ముందస్తుగానే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
నిర్వాహకులు పోలీస్‌పోర్టల్. టిఎస్‌పోలీస్.జిఓవి.ఇన్/ ఇన్‌డెక్స్. హెచ్‌టిఎం పోర్టల్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.
చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అధికారిక పోర్టల్ ద్వారా సమాచారం అందించి హైదరాబాద్ సిటీ పోలీస్ కు సహకరించాలని కోరారు. మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు ముందుగానే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తగిన భద్రతాను పోలీసులు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.

