Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హామీలు అమలు చేయమంటే దాడులా: గాదరి కిషోర్

హామీలు అమలు చేయమంటే దాడులా: గాదరి కిషోర్

కాంగ్రెస్ తొత్తులుగా వివరించే అధికారుల పేర్లు రాస్తాం.

తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరిక

మోత్కూర్ లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ .

ఫోటోలు.

మన తెలంగాణ/మోత్కూర్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే దాడులు చేయడం హేయమైన చర్య అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంఎల్ఎ గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారుల పేర్లు పింకు బుక్ లో రాస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీకి బ్లాక్ టీ షర్టులతో వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులతో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోత్కూర్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. మహిళా ఎమ్మెల్యేలను జుట్టు పట్టి చీరలు లాగడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిదర్శనం అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాధీ ముబారక్ కు రూ.లక్షా 16 వేల లతో పాటు తులం బంగారం,18 ఏళ్లు నిండిన కళాశాల అమ్మాయిలకు స్కూటీ, మహిళలకు రూ. 2500, వృద్ధులకు, వితంతువులకు రూ 4 వేలు, వికలాంగులకు రూ. 6 వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. రైతాంగానికి సాగునీరు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో ఉన్న అన్ని సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్య పాలనను నివసిస్తూ ప్రజావాణిలో ఎంపిడిఒకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్ది, మండల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జంగ శ్రీను, గజ్జి మల్లేష్, మార్కెట్ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్ రెడ్డి, చిప్పలపల్లి మహేంద్ర నాథ్,కౌన్సిలర్ లు నల్ల మధు యాదవ్,సుల్తాన్ స్వామి, కొండా శోభ సోం మల్లు, నాయకులు దబ్బేటి శైలజ,మర్రి అనిల్ కుమార్, జిట్ట సాయికుమార్, బుషిపాక గణేష్, కొండ సోంమల్లు,చౌగొని సత్యం గౌడ్, పొన్నాల వెంకటేశ్వర్లు, దాసరి తిరుమలేష్, సైదులు,ఫైళ్ల దయాకర్ రెడ్డి, మత్య్సగిరి, క్రాంతికుమార్ రెడ్డి,బుగ్గరాములు, యశ్వంతా చారి,నరేశ్,పద్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu