Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ యాత్రికులంతా క్షేమం

హైదరాబాద్ యాత్రికులంతా క్షేమం

న తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 156 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నారని యాత్రకు వెళ్లిన యాత్రికులు తమ కుటుంబ సభ్యులకు వెల్లడించారు.

ఈ నెల 18 మూన్ హిమాలయ ట్రావెల్స్ నుంచి ఏపి ఆదోనికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు, 19 మంది బెంగళూరు, మిగిలిన వారు ముంబాయి, పూణెకు చెందిన వారు, మెత్తం 156 మంది గ్రూప్ వీసాపై యాత్రకు వెళ్లారు. ఘటన జరిగిన సమయంలో 16 మంది అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లలేదని, మిగిలిన 140 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారని అక్కడి

వెళ్లిన యాత్రకులు చెప్పారు. బయటకు వెళ్లిన యాత్రికులందరూ ఘటన సమయంలో 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నట్లు చెప్పారు. కాగా యాత్ర ముగించుకుని సెప్టెంబర్ 1వ తేదీన బృందం భారతదేశానికి రానున్నామని, ఈ లోపు ఘటన జరిగిందని యాత్రికులు వెల్లడించారు. నేపాల్‌లో కొనసాగుతున్న వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడ చిక్కుకున్న లేదా ప్రభావితమైన రాష్ట్ర వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

నేపాల్‌లో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నేపాల్‌లో ఉన్న తెలంగాణకు చెందిన బంధువులు, యాత్రికులు, పర్యాటకులతో కుటుంబ సభ్యులకు సంబంధాలు తెగిపోయినట్లయితే హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. బాధితుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిసారిగా తెలిసిన ప్రాంతం, ప్రయాణ/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను అందించాలని కోరింది. ఈ సమాచారంతో సంబంధిత అధికారులతో సమన్వయం చేసి బాధితులకు సహాయం అందిస్తామని తెలిపింది. హెల్ప్‌లైన్ నంబర్లు పిఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ వందనా 9871999044, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చక్రవర్తి 9949351270, లైజన్ ఆఫీసర్ జి. రక్షిత్ నాయక్ 9618597969 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu