Ranganath
హైదరాబాద్: హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లబించింది. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలంటూ సింగిల్ జడ్జి గతంలో తీర్పు ఇచ్చారు. దీనిపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ సిజె జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు.

