Dailyhunt
హైకోర్టు జోన్-2 నిర్మాణం దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుంది : జస్టిస్ సూర్యకాంత్

హైకోర్టు జోన్-2 నిర్మాణం దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుంది : జస్టిస్ సూర్యకాంత్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైకోర్టు జోన్-2 నిర్మాణాలు గొప్పగా నిలిచిపోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.

ఇప్పుడు చేపడుతున్న హైకోర్టు నిర్మాణం దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుందని అన్నారు. హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఆయన మాట్లాడారు.

జోన్-2 తన మనసుకు చాలా నచ్చిందని, హైకోర్టు జోన్-2 కోసం 100 ఎకరాలు కేటాయించడం సంతోషం అని హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి సిజెఐ అభినందనలు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ కాలంగా న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నానని, ఇప్పటికే హై కోర్టు జోన్-1 భవన కాంప్లెక్స్ నిర్మాణంలో ఉందని అన్నారు. ఇప్పుడున్న హైకోర్టు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, జడ్జిల నివాస సముదాయాల్లో కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని అన్నారు. కోర్టులో జరిగే ప్రోసీడింగ్స్ ప్రజలకు విజిబుల్ జ్యుడిషియరీ, కోర్టు గది వెనక మరో ప్రపంచం ఉంటుందని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu