Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరీశ్ రావును కలిసిన ప్రియదర్శి..

హరీశ్ రావును కలిసిన ప్రియదర్శి..

మనతెలంగాణ/హైదరాబాద్: నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాతో పాటు అందులో తాను పోషించిన శంకరన్న పాత్ర గురించి ప్రియదర్శి ఆయనతో చర్చించారు.

అలాగే తన సినీ ప్రయాణం, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా హరీశ్ రావుతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.

ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక సమాజానికి ఎలా స్ఫూర్తిగా నిలుస్తాయో తెలంగాణ ఉద్యమం ద్వారా చూశామని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒక జాతి గుర్తింపు కోసం సాగిన పోరాటాన్ని 'ది ప్యారడైజ్' సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రభావవంతంగా చూపించారని ఆయన అన్నారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత విస్తృతంగా ప్రేక్షకులకు చేరువ చేసేలా భవిష్యత్‌లో ప్రియదర్శి మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని హరీశ్ రావు కోరారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు ప్రియదర్శి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu