ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచుల్లోనే గెలిచి పాయింట్ల టేబుల్‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది.
దీంతో కెప్టెన్ హార్థిక్ పాండ్య వల్లే ఇదంతా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి వేరే వాళ్లకి అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వచ్చే సీజన్‌కి ముందు హార్థిక్ ట్రేడ్ అవుతాడనే ప్రచారం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో హార్థిక్ పాండ్యా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆ చిత్రంలో హార్థిక్ ల్యాప్‌టాప్‌లో ఏదో వీడియో ప్లే అవుతుంది. పక్కనే ఓ నోట్‌బుక్ పెన్ ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అతడి మొబైల్ స్క్రీన్‌పై '07:07' అని టైమ్ చూపిస్తోంది. అయితే 07 అనేది ఎంఎస్ ధోనీ జెర్సీ సెంబర్. 07కి సంబంధించి ఏం జరిగినా అది ధోనీ వల్లే అని అతడి ఫ్యాన్స్ ప్రచారం చేస్తుంటారు. మరి హార్థిక్ అలా స్టోరీ పెట్టడం వెనక కారణం వచ్చే సీజన్‌లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కి ట్రేడ్ అవుతున్నాడనే సంకేతమా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ స్టోరీలో హార్థిక్.. మహికా శర్మను ట్యాగ్ చేశాడు.

